-పేద ప్రజల సొంత ఇంటి సాకారం లో హౌసింగ్ శాఖ అధికారుల సిబ్బంది పాత్ర కీలకం
– ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తి తో జిల్లా లక్ష్యాలను పూర్తి చేయాలి..
-జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చెయ్యగా, వారి సొంత ఇంటి కలలు నెరవేర్చడంలో గృహనిర్మాణ సంస్థ అధికారుల, సిబ్బంది పై కీలక బాధ్యతలు ఉన్నాయని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పడి 45 వసంతాలు పూర్తి అయిన సందర్బంగా బుధవారం స్థానిక అటవీశాఖ కార్తీక వనంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఆవిర్బావ దినోత్సవం జిల్లా కార్యక్రమానికి జిల్లా కలెక్టరు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టరు డా. కె. మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి స్వంత ఇంటి కల సాకారం చేసిందని అన్నారు. ఆ స్థలంలో సొంత ఇంటిని నిర్మించి అందించడం లో హౌసింగ్ శాఖ పై ఎంతో భాద్యత ఉందన్నారు. ఆ మేరకు వారికి కేటాయించిన లక్ష్యాలను ప్రగతి దిశగా నెరవేర్చలని పేర్కొన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ అధికారులు, సిబ్బంది ఇళ్లులేని నిరుపేదలకు సొంత ఇంటిని నిర్మించి అందించడం ద్వారా వారికి జీవితాంతం ఒక తీపి గుర్తుగా మిగిలి పోతుందని అన్నారు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ లిమిటెడ్ ను 1979 వ సంవత్సరం జూలై నెల 5వ తేదీన స్థాపించడం తో నేటికి 45 సంవత్సరాలు పూర్తయ్యా యన్నారు. జిల్లాలో 68 వేల గృహా నిర్మాణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 21 వేలకు పైగా నిర్మించడం జరిగిందని మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. తాను జేసీగా కృష్ణాజిల్లాలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తు అర్హులైన వారికి అర్బన్ లో సెంటు, రూరల్ ప్రాంతంలో సెంటున్నర స్థలాన్ని అందించడం జరిగిందన్నారు. నేడు కలెక్టరుగా తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలు మంజూరైన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో తాను భాగస్వామ్యం అవ్వడం, ఆ ప్రక్రియలో గృహనిర్మాణ సంస్థ అధికారులు చేస్తున్న కృషి సంతోషదాయకమన్నారు. తాను హౌసింగ్ కాలనీల్లో పర్యటన సందర్బంలో పూర్తయిన ఇళ్లను ప్రారంభోత్సవ సమయంలో సొంత ఇంటి కల నెలవేరిన గృహ యజమానుల ఎంతో సంతోషం వ్యక్తం చెయ్యడం చూసాన్నారు. గృహనిర్మాణాలు పూర్తి చేయడంలో అత్యంత భాద్యతాయుతంగా పనిచేస్తున్న హౌసింగ్ అధికారులు మునుముందు కూడా ఇదే స్పూర్తితో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ప్రతి గృహ యజమాని ఇల్లు నిర్మించి ఇచ్చిన అధికారులను తప్పని సరిగా గుర్తించుకుంటారని అదే మనకు గౌరవం అన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధికమించి హౌసింగ్ అధికారులు మంచిగా పని చేస్తున్నారన్నారు. గృహనిర్మాణ కార్యక్రమంలో అనేక మైలురాయిలు అధిగమిస్తూ తనదైన ముద్రవేసుకున్న సంస్థఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు.ప్రతి కాలనీలో సిసి రోడ్లు, డ్రెయిన్ లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్, ఫైబర్ నెట్ సదుపాయాలు కల్పిస్తూ, రాష్ట్రంలో కొత్త ఊళ్ళు ఏర్పాటు అవుతున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి ఆశయ సాధనలో భాగంగా హౌసింగ్ శాఖ కీలక భాగస్వామ్యం అవ్వడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.జిల్లా హౌసింగ్ అధికారి, డిప్యూటీ ఇంజనీర్స్, అసిస్టెంటు ఇంజినీర్స్, వర్క్ ఇన్ స్పెక్టర్స్ మొదలగు వారి ప్రతిభ అంకిత భావంతో గృహ నిర్మాణ రంగంలో దేశంలోనే నంబర్ వన్ గా నిలువ గలిగిందన్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ గృహ నిర్మాణ సంస్థ 45 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు. జిల్లా హౌసింగ్ అధికారి జి.పరశురాం మాట్లాడుతూ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ స్థాపన నుండి ఎన్నో విజయాలను సాధిస్తూ రాష్ట్రంలోని అత్యున్నత నైపుణ్యం గల ఇంజనీరింగ్ వ్యవస్థతో ప్రత్యేక గుర్తింపు పొంది హిబ్ టెక్ సంస్థ ద్వారా రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ లోని సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించి నైపుణ్యాలను పెంపొందించడంలో ముందంజలో ఉందన్నారు. ఈ సందర్బంగా పలువురు హౌసింగ్ అధికారులు,సిబ్బంది రక్తదానం చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు.కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ అధికారి జి. పరశురాం, ఈఈ సోములు, డీఈఈలు, ఏఈలు, వర్కు ఇస్పేక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News