విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దళారీ వ్యవస్థను రూపుమాపి లంచాలు, అవినీతికి తావులేని పారదర్శక పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ 50బ సచివాలయం పరిధిలోని కాకతీయ నగర్,దనేకుల స్ట్రీట్ ప్రాంతాల్లో అధికారులు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు లో జగన్ గారు దేశంలోనే మిగతా ముఖ్యమంత్రి లకు ఆదర్శంగా నిలిచారని, మరే రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు జరగడాం లేదని అన్నారు. సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ద్వారా పాలన మాకు దగ్గరగా వచ్చింది అని ప్రజలు కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని, అవ్వాతాత లు జగనన్న కు తమ ఆశీస్సులు అందిస్తూ మద్దతుగా నిలుస్తున్నారు అని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో అర్హత ఉన్న సరే జన్మభూమి కమిటీలకి లంచాలు ఇచ్చి, కార్యాలయాల చుట్టూ కళ్ళారిగెల తిరిగిన పధకాలు వచ్చేవి కావని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజురోజుకు ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి అని, అసత్య ప్రచారాలతో ప్రజల మధ్య విద్వెషాలు రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారు అని ఘాటుగా విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ప్రజల మద్దతు తో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో మాగంటి నవీన్,రిజ్వాన్,కాళీ,చిన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …