విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య నారాయణో హరి అని మన పెద్దలు చెప్పినట్లు, వైద్యుడ్ని దేవునితో పోలుస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ముఖ్యకార్య నిర్వహణాధికారి ఎ.ఎమ్.డి. ఇంతియాజ్ పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లోని సెర్ప్ కాన్ఫరెన్స్ హాల్ నందు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా కవి సమ్మేళనం, ‘వైద్యరత్న’ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు బిదాన్ చంద్ర రాయ్ జయంతిని వైద్యుల దినోత్సవం జరుపుతారు. బి.సి.రాయ్ గొప్ప రాజకీయవేత్త, మానవతావాది అని ఆయన సేవల్ని కొనియాడారు.డాక్టర్ సమరం మాట్లాడుతూ కనిపించని దేవుడికంటే కనిపించే వైద్యుడ్ని దేవుడిగా భావిస్తారని వివరించారు. అనంతరం అవార్డు గ్రహీతలు డాక్టర్ కోడే ప్రభాదేవి, డాక్టర్ జాన్ బాబు, డాక్టర్ నీరజ్ కాంత్ లను వైద్యరత్న అవార్డుతో, ఎల్.వి.ఎన్.ప్రసన్న కుమార్, సవరం రోజీ రంజిత, గుజ్జర్ సిద్ధార్థ లను సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వేముల హజరత్తయ్య గుప్త వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ ఆర్. ఆర్ గాంధీ నాగరాజన్, డాక్టర్ కొండూరు హరి నారాయణ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు కె.మురళీ మోహన్ రాజు, కవులు రిజీనా, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …