Breaking News

ఐ పంగిడిలో ఘనంగా రైతు దినోత్సవం

-జిల్లాలో గత ఖరీఫ్ పంట నష్ట పరిహారపు బీమాగా 15087 మంది రైతులకు రూ.11.17 కోట్లు జమ..
-నిడదవోలు, గోపాలపురంలో అగ్రి ల్యాబ్స్ ప్రారంభం
– రాజమహేంద్రవరం, కొవ్వూరు , గోపాలపురంలో పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ప్రారంభించుకున్నాం.

కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గత ఏడాది ఖరీఫ్ పంట నష్ట పరిహారంగా వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం క్రింద 15087 మంది రైతులకు రూ.11.17 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి   అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుండి రాష్ట్రస్థాయి  వైఎస్సార్ రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించగా… జిల్లాస్థాయి కార్యక్రమం   కొవ్వూరు మండలం ఐ. పంగిడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం సొమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా లబ్దిదారుల రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. విత్తనం నాటడం నుంచి ధాన్యం కొనుగోలు వరకు జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉంటుందని అన్నారు.నవరత్నాల్లో భాగంగా ఇప్పటికే 99 శాతం పథకాల ను అర్హులకు అందించడం జరిగిందని మిగిలిన ఒక్క శాతం అందించేందుకు అధికారులు జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మీ ఇళ్లకే వస్తున్నారని జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇ క్రాప్ బుకింగ్ ద్వారా నమోదు చేసుకున్న రైతులందరికీ ఈ పధకం ద్వారాగత మూడేళ్లుగా పంట బీమా ప్రయోజనాలు 2019-20 ఏడాది 541 రైతులకు రూ.8 లక్షలు 2020-21లో 36705 రైతులకు రూ.42.81 కోట్లు 2021-22- ఏడాది 30267 రైతులకు రూ.59.49 కోట్లు అందించడం జరిగిందన్నారు.అదే విధంగా నేడు జరిగే కార్యక్రమంలో గత ఏడాది ఖరీఫ్ పంటనష్ట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారపు బీమాగా నేడు 15087 మంది రైతులకు రూ.11.17 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తున్నా మన్నారు. జిల్లాకు రెండు పంటలకు నోటిఫై చేయబడిన వరి – దిగుబడి ఆధారంగా , అరటి – వాతావరణ ఆధారిత నమోదు కోసం రైతులపై భారం పడకుండా, రైతుల తరపున ప్రీమియం వాటాను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా జిల్లాకు చెందిన నిడదవోలు, గోపాలపురం అగ్రి ల్యాబ్స్,   రాజమహేంద్రవరం, కొవ్వూరు , గోపాలపురం లో మూడు పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలు ప్రారంభించు కున్నామన్నారు.జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ మన జిల్లా వ్యవసాయాధారిత జిల్లా అన్నారు. దేశంలో రైతులకు సంబంధించి అత్యధిక పథకాలు మనం రాష్ట్రం లోనే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.గతంలో ఎరువులు, విత్తనాలు కొరకు పడిగాపులు పడేవారని, నేడు ఆర్. బీ. కే. లు ద్వారా రైతులు వారి గ్రామం లోనే వ్యవసాయ సాగు సమాచారం తొ పాటు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సకాలంలో ప్రభుత్వం  అందిస్తోందన్నారు.  పిఎమ్ కిసాన్, రైతు భరోసా ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిచడంతో పాటు, ప్రధాన మంత్రి పసల బీమా క్రింద  రాష్టంలో రైతుల వాటా ఫ్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లించి పంట నష్ట పోయిన రైతులను గుర్తించి వైఎస్సార్ ఉచిత పంటల  బీమా సొమ్మును ప్రభుత్వం అదే  సీజన్లో రైతులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.జిల్లాలో వై ఎస్సార్ యంత్రం సేవ పధకం  ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రం పరికరాలు  అందించామన్నారు. వ్యవసాయ రంగంలో నూతన సాకేతిక విధానాన్ని అమలు పరుస్తూ నిరుద్యోగులకు డ్రోన్ లో శిక్షణ అందిస్తున్నామన్నారు. డ్రోన్ వినియోగం వలన ఖర్సు తగ్గుతుందన్నారు. గత రబీ సీజన్ లో జిల్లాలో 367 ఆర్బీకేల పరిధిలో గల 233 ఆర్.బి.కెల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా జిల్లాలో రూ.455 కోట్ల విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేసా మన్నారు.

జగనన్న సురక్ష కార్యక్రమం
జగనన్న సురక్ష కార్యక్రమంలో ద్వారా ఎవరికీ రూపాయి ఖర్చు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం వివిధ రకాల ధ్రువ పత్రాలు, భూమి సరిహద్దు కొలతలు వంటి 11 రకాల సేవలు అందిస్తున్నామని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా నేరుగా 1902 కు ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నా రన్నారు. అర్హత వున్నా ప్రతి ఒక్కరికీ జూన్, డిసెంబర్ మాసాల్లో బై వెన్యూవల్  మంజూరు చేసే క్రమంలో వారికీ పథకాల  ప్రయోనాలను ప్రభుత్వం అందుస్తున్నదన్నారు.

ఓటరు గా నమోదు కావాలి
ఈ నెల 21 నుంచి ఆగస్టు 20 వరకు ఓటు నమోదు, తొలగింపు చేర్పులు, మార్పులకు సంబంధించి ఫారం 7, 8 ద్వారా సవరణ చేస్తారని కలెక్టర్ మాధవీలత తెలిపారు.. ఇంటిటికి వచ్చే బూత్ లెవెల్ అధికారి కోరిన వివరాలు ఇచ్చి సహకరించాలని అన్నారు.కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా హారికల్చర్ అధికారి వి. రాధాకృష్ణ, హార్టికల్చర్ శాస్త్రవేత్త కే. రామా నందం, ఎడి వి.చంద్రశేఖర్, ఏఎమ్ సీ చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాస్, సర్పంచ్ గోశాల నాగార్జున, ఏ డి. మార్కటింగ్ యం. సునీల్ వినయ్, తాహిసీల్దార్ డి. టి. కె. అజయ్ బాబు, యంపిడిఓ, కె. సుశీల, వైస్ యంపిపి వీరమళ్ళ నారాయుడు, ఉప సర్పంచ్ ఉప్పులూరి నానాజీ, యంపిటిసి కొనాల భవాని, కోమటి కృష్ణంరాజు, ఆత్కూరి ప్రసాద్, జిల్లా వై ఎస్సార్ సీపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు హెచ్. వీరన్న, మాజీ ఏ ఎమ్ సీ చైర్మన్ బండి పట్టాభి రామారావు, స్థానిక నాయకులు ముదునూరి నాగరాజు, ,  ముదునూరి సూ ర్య నారాయణ రాజు, తోటరామకృష్ణ, రైతులు , సచివాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *