జగనన్న సురక్ష దేశానికే ఆదర్శం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ సత్వర న్యాయం కోసం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనారు. 32 వ డివిజన్ అయోధ్యనగర్లో సోమవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఎన్నో జఠిలమైన సమస్యలకు సురక్ష ద్వారా పరిష్కారం లభించిందని మల్లాది విష్ణు అన్నారు. సాంకేతిక, మరే ఇతర కారణాలతో సంక్షేమ కార్యక్రమాలకు అర్హులెవరూ మిగిలిపోకూడదన్నదే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు కావలసిన అన్ని సర్టిఫికెట్లు క్యాంపు ద్వారా ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వాలంటీర్లు, వార్డు కార్యదర్శులు, గృహ సారథులు, కన్వీనర్లతో కూడిన బృందం వారం రోజుల నుంచి డివిజన్లోని 3,291 గృహాలలో విస్తృతంగా సర్వే నిర్వహించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీరిలో 1,768 మంది వివిధ రకాల పత్రాల కోసం వినతులు సమర్పించగా.. 717 మంది కుల సర్టిఫికెట్ల కోసం., 1,040 మంది ఆదాయ సర్టిఫికెట్ల కొరకు అర్జీలు అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో 30 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు చెప్పారు. అర్హత కలిగి ఎవరైనా మిగిలిపోయి ఉంటే సురక్షలో దరఖాస్తు చేసుకోవచ్చని.. 90 డేస్ ప్రోగ్రాం ద్వారా వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పేదలందరూసద్వినియోగపరచుకోవలసిందిగా సూచించారు. అలాగే ప్రతి పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా యంత్రాంగమంతా పనిచేయాలని కోరారు. అనంతరం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, నార్త్ ఎమ్మార్వో మాధురి, వైసీపీ నాయకులు ఒగ్గు గవాస్కర్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *