Breaking News

ఆదివారం విద్యుత్ బిల్లులు వసూళ్లు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలోని గల అన్ని విద్యుత్ రెవిన్యూ కార్యాలయాలలోని విద్యుత్ బిల్లులు వసూళ్ళ కౌంటర్లు ది.31.12.2023 (ఆదివారం) అంటే శెలవు దినములో కూడ పని చేస్తాయని రాజమహేంద్రవరం సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఏ.పి.ఇ.పి.డి.సి.యల్: ఆపరేషన్ సర్కిల్ ) టి.వి.ఎస్.ఎన్.మూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని విద్యుత్ వినియోగ దారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరారు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించవల్సిందిగా తెలిపారు. ఈ విద్యుత్ బిల్లులను రెవిన్యూ కార్యాలయాలతో పాటు, ఏ.పి.ఈ.పి. డి.సి.యల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏ.టి.పి. సెంటర్ లలో కూడా ఈ ఆదివారం చెల్లించవచ్చునని అయన తెలియ చేశారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాల్సిందిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *