Breaking News

సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందాలు బరుల నిర్వాహకులపై నిఘా పెట్టాలి

-జిల్లాలో కోడి పందాలు జూధ క్రీడలపై నిషేధం
-జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ సందర్భంగా జూద క్రీడలు, కోడిపందాలు పై నిషేధం ఉందని, ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత పేర్కొన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కోడిపందాలు నిషేధంపై జిల్లా పశుసంవర్ధక శాఖ, జిల్లా పంచాయతీ అధికారులతో కలసి కోడిపందాలు నిషేధం పై రూపొందించిన గోడ ప్రతులను, కరపత్రాలను కలెక్టర్ డా. మాధవీలత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా లోని ఏ ప్రాంతంలోనైనా కోడి పందాలు నిర్వహించడానికి అనుమతి లేదని ఈ విషయంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ఇటువంటి క్రీడల నిర్వహణ నిషేదం విషయంలో కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అన్నారు. పోలీసులు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కోడిపందాల నిర్వాహకులపై దృష్టి సారించి, అటు వంటివి నిర్వహించ కుండా జరగకుండా విస్తృత దాడులు కేసు నమోదు చేయాలని కలెక్టర్ మాధవీలత సూచించారు. పొలాల్లో బరులు వేసే యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

జిల్లావ్యాప్తంగా కోడిపందాలు జూధాలు అనధికార మద్యం విక్రయాల పై జిల్లా, డివిజన్, మండలాల్లోని సమన్వయ కమిటీలు విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా జిల్లాలో కోడిపందాలు, జూదాలు, అటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోడి పందాలు నిర్వహించే, పాల్గొనే వారిపై జంతు హింస చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. కోడిపందాలకు జూద క్రీడలకు స్థలాలు ఇచ్చే భూ యజమానులపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుము వసూలు చేయడం జరుగుతుందన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో చిత్రీకరించి ఆధారాలను సేకరించి సంబంధిత సమన్వయ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన లేదా ప్రోత్సహించిన వారిపై 144 పిసి , తదితర అనుబంధ కేసులు నమోదు చేయాలని ఆమె తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న మార్గదర్శకాలకు లోబడి వివిధ సెక్షన్ల ప్రకారం క్రీడా చట్టం 1974 మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ మాధవీలత సూచించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కల్తీ మద్యం విక్రయాలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోలు, సమన్వయంతో పని చేయాలన్నారు.

కార్యక్రమంలో డి ఎ హెచ్ వో డా ఎస్ జి టి సత్య గోవింద్, డిపివో జేవి సత్యనారాయణ, డి హెచ్ ఓ జీ. పరశురామ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యస్. జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *