గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేయడం హర్షణీయం… : కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2018లో నిర్వహించిన ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 మెయిన్స్‌ను ఎపీ హైకోర్టు రద్దు చేస్తూ తీర్పునివ్వడంపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ 2018 గ్రూప్‌-1 పరీక్షల ఫలితాలను ప్రకటించింది. ప్రశ్నాపత్రాల డిజిటల్‌ వాల్యుయేషన్‌పై పలువురు అభ్యర్థులు ఎపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెయిన్స్‌ ఫలితాలను నిలిపివేశారు. జవాబు పత్రాల మాన్యువల్‌ మూల్యాంకనం చేయాలని గతంలో ఎపిపిఎస్‌సిని హైకోర్టు ఆదేశించింది. ఇప్పుడు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ, మరో 6 నెలల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఎపిపిఎస్‌సిని ఆదేశించింది. ఎపిపిఎస్‌సిలో అధికార పార్టీకి చెందినవారే సభ్యులుగా ఉండడం సరైంది కాదు. 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టులోనైనా అభ్యర్థులకు న్యాయం జరగడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఇకనైనా పారదర్శకంగా వ్యవహరించాలని, రానున్న కాలంలోనైనా జవాబు పత్రాలను మాన్యువల్‌ మూల్యాంకనం చేయాలని కోరుతున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *