విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొన్ని సంఘటనలలో కొందరు ఫిట్స్‌తో చేతులు, కాళ్ళు కొట్టుకుంటూ కనిపిస్తున్న సందర్భాలు అరుదుగా చూస్తూ వుంటాం. అలాంటి సందర్భంలో వారి చేతిలో తాళం చెవులులాంటి పెట్టిన సందర్భాలు కూడా వుంటాయి. అటువంటి ఫిట్స్ (మూర్చవ్యాధి) ఎవరికైనా వస్తే ఫికరవ్వద్దు…అంటే భయపడకుండా వెంటనే మెదడుకు సంబంధించిన డాక్టర్‌ను సంప్రదించాలని డాక్టర్ వి.శ్రీధర నారాయణ చెపుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రముఖ వెన్నుముక శస్త్ర చికిత్స నిపుణులు డా.జి.పి.వి.సుబ్బయ్య, డా.రియాజ్‌ఖాన్‌లు సారధ్యంలో ప్రారంభించబోతున్న ‘నాసా’ హాస్పిటల్స్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ వి.శ్రీధర నారాయణ మాట్లాడుతూ ఫిట్స్ (మూర్చవ్యాధి) చూడటానికి చాలా భయంకరంగా వున్నా పూర్తిగా నయమయ్యే జబ్బు అని అన్నారు. ఫిట్స్ అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడం, బిత్తర చూపులు చూడటం, మనస్పృహలో లేకపోవడం. చిన్న వయసులో డామేజ్ అవడం, కొన్ని సందర్భాలలో ప్రసవం సమయంలో బేబీ డిలే అవడం మెదడు డామేజ్ అయ్యే అవకాశం వుంది. జ్వరం ఎక్కువ వచ్చి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం వుందన్నారు. వయస్సు పెరిగే కొద్ది మెదడులో పురుగులు వుండటంవల్ల కానీ, మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీ (తరంగాలు) ఎక్కువ రావడంవల్లగానీ ఫిట్స్ వచ్చే అవకాశముందన్నారు. మూర్చవ్యాధిని ఫిట్స్ లేదా పాశ్వాయ్ అని కూడా అంటారన్నారు. ఈ వ్యాధి 100 శాతం మందులతో నయమయ్యే జబ్బు అని అన్నారు. మందులు సరిగా వాడకపోతే తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశముందన్నారు. ఎంఆర్‌ఐ, వీడియో ఇఇజి పరీక్షల వల్ల ఈ వ్యాధిని గుర్తించి మెదడులో ఏ భాగం నుండి వస్తుందో తెలుసుకుని దాని ద్వారా చికిత్స నిర్వహిస్తామన్నారు. ఇది కేవలం మెదడు ఆపరేషన్ వల్లే సాధ్యమవుతుందన్నారు. మెదడులో కణితలు, జన్యుపరంగా మెదడులో వచ్చే లోపాలు, మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోయినా, ప్రమాదంలో రక్తస్త్రావం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం వుందని అయినా కూడా వీటిని సర్జరీ ద్వారా బాగుచేయవచ్చన్నారు. వీటిలో వేగల్ స్టిమిలేషన్ చికత్స ఒకటి తెలిపారు. మందులకు స్పందించని రోగులకు శస్త్రచికిత్స అనేది ఒక ఎంపిక మాత్రమే అని అన్నారు. ఈ ఫిట్స్ ఎత్తైన బిల్డింగ్‌పై వున్నప్పుడైనా, వాహనాలు నడుపుతున్నప్పుడైనా, ఈత కొట్టే సందర్భాలు తదితర అనేక సందర్భాలలో ఈ ఫిట్స్ వస్తే చాలా ప్రమాదమన్నారు. ముఖ్యంగా మూర్చవ్యాధి వస్తే అవగాహన లేకపోవడం వల్ల అనేక అపోహలకు గురై రకరకాలు ఆలోచిస్తారన్నారు. అలా కాకుండా వెంటనే డాక్టర్‌ను కలిస్తే పూర్తి చికిత్స ద్వారా నివారించవచ్చన్నారు. నేను కెనడాలో ఫిట్స్ సర్జరీమీద స్టడీ చేసి వచ్చానన్నారు. పెద్ద సర్జరీలు ఇప్పటికీ సుమారు 100కి పైగా చేశానని, నెలకు సుమారు 30, 40 ఫిట్స్‌కు సంబంధించి మెదడు ఆపరేషన్స్ చేస్తున్నామన్నారు. 24/7 ‘‘నాసా’’ హాస్పిటల్స్‌లో మెదడు, వెన్నుముక, ఆర్థోపెడిక్, యాక్సిడెంటల్ (ట్రామా) కేసుల చికిత్సచేసి వైద్యసేవలు అందించడం కోసం డాక్టర్స్, సిబ్బంది అందుబాటులో వుంటామన్నారు.
Prajavartha Online Telugu News