విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీకు వరకు నిర్వహించనున్నట్లు యోగ శక్తి సాధన సమితి,విజయవాడ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ సంవత్సరం ‘అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స’ అనే అంశంపై ప్రజల్లో అవగాహన,వారే తగ్గించుకునే లాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయునున్నట్లు తెలిపారు.చివరి రోజు జూన్ 21న యోగశక్తి చికిత్సను ప్రజల్లోకి తీసుకు వెళుతున్న ,ప్రోత్సహిస్తున్న వ్యక్తి లకు,సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని ఇప్పుడు అసహజ మరణాలు బాగా పెరిగి ప్రజల్లో ఆందోళన పెరిగిందని దానికి సమాధానాలు తెలియజేసి ,జాతిని శాతింపచేయవలసిన బాధ్యత అందరిపై ఉందని,డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. హార్ట్ ఎటాక్ లు, కెన్సర్లు, పక్షవాతాలు, ఊపిరిసమస్యలు, సర్జరీల సంఖ్య గణనీయకంగా పెరిగిపోయిన తరుణంలో ‘యోగశక్తి సాధన సమితి ‘ప్రజల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని,సమస్యల మూలానికి వైద్యం జరిగేలా ఖర్చు గణనీయకంగా తగ్గేలా వ్యక్తి మరియు కుటుంబ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేలాగా ,శిక్షణ ఇవ్వడం మరియు ప్రత్యక్ష ప్రదర్శనలను అన్ని ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.భారత సాంప్రదాయ వైద్యం(బిటిమ్)ప్రపంచమంతా ఆచరించేలాగా ప్రపంచం ఆరోగ్య సంస్థ చేపట్టిన ఉద్యమానికి తమ సంస్థ సహకారం అందించినున్నట్లు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో యోగా గురువులు జి కృష్ణ,బాల సురేషు, ధెరపిస్టులు అశ్రపున్నీష పాల్గొన్నారు. 21 రోజులు సాగే ఈ ఉత్సవాల్లో పాల్గొనువారు సెల్ నెంబర్ 9000347367 ద్వారా నమోదు చేసుకోవలసినదిగ కోరారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …