-నూతన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తాం…
-బొప్పరాజు మరియు పలిశెట్టి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం సచివాలయంలో కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత ని ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటీ కలసి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పాటైన డైనమిక్ క్యాబినెట్లో అనిత వంగలపూడి కి ఎంతో ప్రధానమైన హోమ్ శాఖ బాధ్యతలు తీసుకోవడం అనిత వంగలపూడి కష్టానికి ఫలితమేనని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులుగా మా వంతు పాత్ర పోషించి, రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి నూతన ప్రభుత్వానికి తోడ్పాటు, సంపూర్ణ సహకారం అందిస్తామని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వివి మురళీ కృష్ణ నాయుడు అన్నారు.
ఈ శుభాకాంక్షలు తెలియజేసిన కార్యక్రమంలో ఏపి పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు వారి కార్యవర్గ సభ్యుల, ఏపి హోం గార్డులు వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు వారి కార్యవర్గ సభ్యులు, ఏపిరేవిన్యూసర్వీసెస్ అసోషియేషన్ కె.రమేష్ కుమార్, ఏపిపోలీస్ అధికార్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు,ఏపి పంచాయితీరాజ్ ఇంజనీర్సు అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శిలు వి.వి.మురళీకృష్ణ నాయుడు కనపర్తి సంగీతరావు,ఏపి ప్రభుత్వడ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంసాన శ్రీనివాసరావు, ఏపీ క్లాస్ -IV ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్. మల్లేశ్వరరావు, ఏపి కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్రఅధ్యక్షులు కే.సుమన్, ఏపీ జెఏసి అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జెనరల్ శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య, తధితరులు కలసి శుభాకాంక్షలు ఏపిజేఏసి అమరావతి మరియు అనుబంద సంఘాల రాష్ట్రకమిటి నాయకులు అందరు కలసి మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసారు.