– జనసేన ఎమ్మెల్సీ ప్రసాద్
– హరి ప్రసాదను సత్కరించిన ఐజేయు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో వినిపిస్తానని జనసేన ఎమ్మెల్సీ పి.హరి ప్రసాద్ హామీ ఇచ్చారు. జనసేన తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన పి.హరి ప్రసాద్ ను ఐజేయు, ఏపీడబ్ల్యూజే నాయకులు ఈరోజు సాయంత్రం జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కలిసి ఆయనకు చిరు సత్కారం చేసింది. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పి. ప్రసాద్కు అందజేశారు. వీటిపై స్పందించిన హరి ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు సుపరిచితమైనవే నాని , వాటన్నిటి పరిష్కారం కోసం జనసేన పార్టీ తరఫున శాసనమండలిలో వినిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు .ముఖ్యంగా జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు ,హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు ప్రమాదబీమా తదితరాంశాలను శాసనమండలిలో వినిపిస్తానని ఆయన వివరించారు .జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యల పట్ల తమ పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా ఉన్నారని వాటిని తప్పకుండా పరిష్కార పరిష్కారం అయ్యే దిశగా జనసేన కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.. హరి ప్రసాద్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ వి సుబ్బారావు ,చందు జనార్ధన్ ,ఐజేయు కార్యదర్శి డి.సోమ సుందర్, ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కంచల జయరాజ్ తదితరులు ఉన్నారు..
Prajavartha Online Telugu News