Breaking News

బెజవాడ రైల్వే స్టేషన్ లో కామరాజర్ విగ్రహం ఏర్పాటు చేయాలి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కే.కామరాజర్ 122వ జయంతి వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఊర్మిళ నగర్ లోని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత కామరాజర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. స్వాతంత్ర్య పోరాట యోధుడుకే కామరాజర్ శిలా విగ్రహం విజయవాడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. కామరాజర్122వ జన్మదిన వేడుక సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశానని తెలిపారు. 9 సంవత్సరాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కామరాజర్ తొలి నాళ్ళలో తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్య్ర పోరాటంలో జైలులో వున్నారని గుర్తు చేశారు. నెహ్రూకి కామరాజర్ కి వున్న అనుబంధం గుర్తు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో కే.కామరాజర్ విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రసంగిస్తూ తమిళన్ అంటే గొప్ప అని భారతీయుడంటే అంతకన్నా గొప్ప అని తన జాతీయ భావాన్ని తొలిసారిగా బెజవాడ లోనే ప్రకటించారు. పైగా మన దేశానికి ఇద్దరు ప్రథమ మంత్రులను ఇచ్చిన “కింగ్ మేకర్ “ఆయన, ఆనాడు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహన్న భోజనం తెచ్చిన ఘనత ఆయనది. అలాగే మద్యం లేని పాలన ఇచ్చిన ఘనత ఆయనదే మొట్టమొదటి మహిళా ప్రధానిని ఇచ్చిన ఘనత ఆయనది. ఇలా ఎన్నో ఎన్నెన్నో చేసిన వారు ఆయన అందుకే ఆయనకు “కింగ్ మేకర్ ” అని మన భారత ప్రభుత్వంచే ప్రకటించబడ్డారని ఆయన పేరుకొన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజయవాడ రైల్వేస్టేషన్లో ఆయన శిలావిగ్రహాన్ని నిర్మించాలని, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమిళ ప్రజలకు ఇచ్చే విలువగాను గుర్తించడం జరుగుతుందని గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏపీ బాధ్యురాలు బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *