అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను జె ఎస్ డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ నేడు అమరావతి లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఆయన చంద్రబాబుతో చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు వివరించారు. తగిన ప్రతిపాదనలతో రావాలని జిందాల్‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ఇద్దరు కలిసిన ఫొటోను చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. జిందాల్‌ను కలవడం సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కలయిక ద్వారా రాష్ట్రంలో కొత్త అవకాశాలు సృష్టించి ప్రజలకు మంచి చేయెుచ్చని ఎక్స్‌లో చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News