Breaking News

ప్లాస్టిక్ రహిత సమాజానికి ఎల్లప్పుడు సహకరిస్తాం

-కాలుష్య రహిత సమాజానికి తోడ్పడుదాం
ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ను సఫాయి కర్మచారి అసోసియేషన్ అండ్ ట్రీస్ గ్రూప్ వారు మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలో గల ఇంచార్జ్ కమిషనర్ గారి చాబర్లో కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం వారు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని, అందుకు అనుమతి ఇవ్వమని కోరారు. అసోసియేషన్ తరపున వారు 2200 యువతి యువకులతో కలిసి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆర్గానిక్ పద్ధతిలో 15 లక్షల ఫలాల మొక్కలను నాటే విధంగా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ ప్లాస్టిక్ రహిత సమాజానికి ఎల్లప్పుడూ విజయవాడ నగరపాలక సంస్థ సహకరిస్తుందని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం వారు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. యువతీ యువకులు ఇందులో భాగస్వాములు అవుతూ మొక్కలను నాటడం వల్ల కాలుష్యం రహితమైన సమాజానికి తోడ్పడడంలో ఒక అవకాశం అని అన్నారు.

ఈ సమావేశంలో సఫాయి కర్మ చారి అసోసియేషన్ అండ్ ట్రీస్ గ్రూప్ స్టేట్ ప్రెసిడెంట్ బండి కాలేశ్వర్ రావు, కోఆర్డినేటర్ మురళి, సెక్రటరీ దుర్గారావు, సభ్యులు ఫిలిప్స్ కారంగి, కొమర వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *