విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డిండ్ సోసైటీ చేస్తున్న అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్రీహరిపురం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో-ఆరేటీవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అదివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కో-ఆరేటీవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.శ్రీనివాస్, కార్యదర్శి వీరమాచనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ పూర్తైన ఫ్లాట్లకు సొసైటీ వారు మరల చదరపు గజానికి రూ.1500 చెల్లించాలని ఎటువంటి డెవలప్మెంట్ పనులు చేయకుండా లే అవుట్ మెయింటెనెన్స్ పేరుతో నెలకు చదరపు గజానికి రూ.10 చొప్పున చెల్లించాలని ప్లాట్ ఓనర్లకు డిమాండ్ నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని కేతనకొండ గ్రామంలో 2016 సంవత్సరంలో గృహ నిర్మాణ సంఘంను ఐసీడీఎస్ మాజీ ఉద్యోగులైన అడ్డాల సుబ్బరాజు (భీమవరం) నాదెండ్ల విశ్వనాథం (తిరుపతి) ఏర్పాటు చేశారని తెలిపారు. వారు 84 ఎకరాల 57 సెంట్లులో 828 ప్లాట్లగా వేశారన్నారు. అందులో 655 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. మరో 72 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. స్థల యాజమాని చింతా మనోజ్ రాజు తన భూమికి సంబంధించి డబ్బులు చెల్లించలేదని విజయవాడలోని 7వ అడిషనల్ కోర్టులో దావా వేశారని అందులో 43,000 చదరపు గజాలకు అటాచ్మెంట్ చేసుకున్నారన్నారు. ఇంద్రకీల ఫైనాన్స్ వారికి 18,650 చదరపు గజాలను 8 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టగా వారు బాకీ చెల్లించలేదని ఈ-ఆప్షన్ వేసి విక్రయించారని తమకు సమాచారం వచ్చిందన్నారు. 85 ఎకరాల భూమిని 102 కోట్లకు కొనుగోలు ఒప్పందం చేసుకొని 6.5 కోట్లు బ్రోకరేజ్ చెల్లింపు చేశామని, సంవత్సరానికి రూ.5 కోట్లు ఆఫీస్ ఖర్చు అంటూ తమను మోసం చేస్తున్నారన్నారు. 653 ప్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తైన వారు వారితో పాటు 72 మార్టికేజ్ ఫ్లాట్ ఓనర్లులతో సమావేశం జరిపి వారి ఆమోదాలతోనే లే అవుట్ డెవలప్మెంట్ పనులు వారితో పూర్తి చేయించాలన్నారు. గత 15 నెలలుగా తాము ఇచ్చిన వినతి పత్రాలపై సహకార శాఖ ప్రాధిమిక విచారణ చేసి అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు రావటంతో సెక్షన్-19 విచారణ జరపమని 2023 నవంబర్ 27న ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ పూర్తి అయ్యి 4 నెలులు గడుస్తున్నా ఇంతవరకు రిపోర్టు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇందులో కొంతమంది సహకారం ఉందన్నారు. అంతే కాకుండా సోసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు చేసినా అనేక అక్రమాలు కారణంగా తాము అనేక రకాలుగా నష్టపోయామని చెప్పారు. న్యాయం చేయవలసిన సహకార అధికా రులు వారికి మద్దతుగా ఉంటున్నారని తమకు తగిన న్యాయం చేసి వారిపై చర్యలు తీసుకొవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సొసైటీలో సభ్యులుగా కొనసాగుటకు అర్హులు కాని వారి సభ్యత్వం తొలగించాల న్నారు. ఇటువంటి అనేక అవినీతి అక్రమాలకు మోసాలకు పాల్పడిన సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ని కలసి అన్ని వివరాలు తెలిపి తమకు న్యాయం చేయమని కోరతామన్నారు. ఈ కార్యక్రమం ఉపాధ్యక్షులు పీఎస్ఎన్ రాజు, పీబీవీఎస్ నాగేశ్వరరావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …