మచిలీపట్నం (గిలకలదిండి), నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉదయం గిలకలదిండిలో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సంబంధించిన పురోగతి పనుల వివరాలను ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ. 422 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో డ్రెడ్జింగ్, నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు చురుకుగా సాగుతున్నాయని, మొత్తం మీద 50 శాతం మేర పనులు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ మారిటైం ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. మత్సశాఖ జిల్లా అధికారి ఏ చంద్రశేఖర్, ఏపీ ఎమ్ఐడిసిఎల్ ఈఈ మునిరెడ్డి, ఏఈ మహేష్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Tags machilipatnam
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …