పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉదయం పెడనలో 16వ వార్డు మచిలీపట్నం రోడ్డు సచివాలయం పరిధిలో వృద్ధురాలు పిచ్చుక మల్లికాంబ గృహం సందర్శించి, ఆమె ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు అడిగి ఆమెకు 4000 రూపాయల వృద్ధాప్య పింఛను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు రూ 102.16 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఇళ్ల వద్ద అందజేయుటకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రామయ్య, మున్సిపల్ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు .
Tags machilipatnam
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …