Breaking News

రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భిణీ స్త్రీలు, కౌమార బాలికల్లో రక్తహీనత (అనీమియా) నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై అమలు చేస్తున్న వివిధ పథకాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రస్తుత పరిస్థితుల్లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విషపూరిత పాముకాటు కేసులు పెరగటానికి అవకాశం ఉందని, ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స చేయాలన్నారు. యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్లు తదితర అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. తాగునీటి పైపులు లీకై మురుగు నీరుతో కలుషితమై అతిసార వ్యాధులు (డయేరియా) ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి నిర్మూలించేందుకు ఎంఎల్ హెచ్ పి లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామని, ఇందులో భాగంగా 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్ అనే మూడు సాధారణ రకాల క్యాన్సర్లను పరీక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వైద్యాధికారులు కలెక్టర్కు వివరించారు.

ఈ సమావేశంలో డిఎంహెచ్వో డాక్టర్ జి గీతాబాయి, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రావణ్ కుమార్, మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుందరాచారి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *