Breaking News

బాల్య వివాహాలను ఉపేక్షించేది లేదు..

-టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సమాచారం అందించండి, వివరాలు గోప్యంగా ఉంచుతాం .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్యవివాహాలను ఉపేక్షించేది లేదని, జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి ఫోన్ చేసి తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సచివాలయ మహిళా పోలీస్, అంగన్వాడి కార్యకర్తలు, సిబ్బంది వారి పరిధిలో జరిగే బాల్య వివాహాలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పైఅధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందగానే అధికారులు వెంటనే స్పందించాలని, తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాల్యవివాహాల వల్ల వారి చదువు, భవిష్యత్తు నాశనం అవడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, దీనిపై పాఠశాలలు, గ్రామాలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి సువర్ణ, సిడిపివోలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *