-రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లోనూ అందుబాటు
-జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రివర్యుల ఆదేశాలను అనుసరించి జిల్లాలో రైతుబజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో సరసమైన ధరల్లో నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉషోదయ, మెట్రో, రిలయన్స్, డీమార్ట్ తదితర పెద్ద రిటైల్ దుకాణాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు పొందొచ్చాన్నరు. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు (దేశవాళి) ధర రూ. 181 ఉండగా, ప్రత్యేక కౌంటర్లలో రూ. 150కే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా కిలో బియ్యం (స్టీమ్డ్-బీపీటీ/సోనామసూరి) ధర మార్కెట్లో రూ. 55.85 ఉండగా ప్రత్యేక కౌంటర్లలో రూ. 48కే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కిలో బియ్యం (పచ్చి-బీపీటీ/సోనా మసూరి) రూ. 52.40 ఉండగా.. ప్రత్యేక కౌంటర్లలో రూ. 47కే లభిస్తుందని వివరించారు. అన్ని అమ్మకం కౌంటర్ల వద్ద సరుకుల నాణ్యతను టెక్నికల్ సిబ్బంది, తూకాన్ని లీగల్ మెట్రాలజీ సిబ్బంది తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా సూచించారు.