విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డ్రగ్ రహిత ఆంధ్ర ప్రదేశ్ పైన అవగాహన సదస్సును స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజయవాడ వెస్ట్ వారు ఎస్ఆర్ఆర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి డ్రగ్ రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంతో, యువత మేలుకో, భవితను మలుచుకో, డ్రగ్స్ ను వదులుకో, డ్రగ్స్ రహిత సమాజం-సంక్షేమానికి సాంకేతం అని అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్ శ్రీ రామ శివ గారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజాన్ని కోరుతుందని, దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పైన ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని, యువత దేశానికి పట్టుకొమ్మలని, సన్మార్గంలో పయనించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, యువత దేశానికి ఎంతైనా అవసరమని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు మదకద్రవ్యాల పైన అవగాహన కార్యక్రమాల్ని విరివిగా కొనసాగించడం అభినందించదగ్గ విషయమని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ఎన్ఎస్ఎస్ వారి బాధ్యతని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్యూరో విజయవాడ వెస్ట్ సిఐ శ్రీ శ్రీనివాస రెడ్డి గారు ఎస్సై అల్లూరయ్య గారు, కళాశాల పిడి డాక్టర్ డి యుగంధర్ గారు, అధ్యాపకులు డాక్టర్ నవీన డాక్టర్ రాధిక ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …