Breaking News

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీని ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు

ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనకు దిశగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి పేద వారికి ఆసరాగా నిలుస్తోందని, ఎక్కడ చూసినా అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి ఉదయాన్నే పెన్షన్లు తమకు ఇస్తున్నారని ప్రభుత్వం పట్ల పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

నేటి గురువారం ఉదయం ఏర్పేడు మండలం ఆమండూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి సచివాలయ సిబ్బంది పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు. ఆమండూరు గ్రామ పంచాయితీ పరిధిలోని సుబ్బరామయ్య (82), నల్లయ్య, ఎం. కొండయ్య, కేశవులు వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి రూ.4000 పింఛన్లను అందచేశారు. అలాగే ఎ.కుప్పయ్య (65), మునెమ్మ.కే విభిన్న ప్రతిభవంతులకు దివ్యాంగుల పెన్షన్ రూ.6000 పింఛన్లను అందచేశారు. మండలంలో అన్ని గ్రామాల్లో శత శాతం పెన్షన్ల పంపిణీ నేడు పూర్తి చేయాలని, పర్యవేక్షించాలని ఎంపిడిఓ కు సూచించారు.

గౌరవ ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. అంతకు మునుపు ఉదయం జిల్లా కలెక్టర్ తిరుపతి పట్టణంలోని ఎంఆర్ పల్లి సచివాలయం పరిధిలో పెన్షన్ల పంపిణీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గిడ్డయ్య, సర్పంచ్ బాల గుర్నాథ్, ఈఓ ఆర్డి రమణ ప్రసాద్, సచివాయ సిబ్బంది తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *