-ఈనెల 5 వ తేదీ నాటికి ఇందిరాగాంధీ స్టేడియాన్ని సిద్దం చేయండి..
-జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన తెలిపారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జి. సృజన శుక్రవారం స్టేడియంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన 78వ స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ అబ్దుల్ నజీర్ తో పాటు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు వేడుకలలో పాల్గొంటారన్నారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సుమారు ఆరు వేల మందికి పైగా విద్యార్థి విద్యార్థులు హాజరు కానున్నారని వారికి అవసరమైన అల్పహారం త్రాగునీరు అందించేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాన్నారు. ప్రాంగణంలో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖాధికారులు జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర మందులతో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలను ప్రత్యేక్ష ప్రసారం చేయడంతో పాటు పబ్లిక్ అడ్రర్సింగ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో, ఫైర్, ఏపిఎస్‌ఆర్‌టిసి, మెడికల్ అండ్ హెల్త్, సివిల్ సంప్లయి, తదితర అధికారుల సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. సాధారణ పరిపాలన శాఖ విఐపిలకు వివిఐపిలకు ప్రోటోకాల్ ప్రకారం కేటాయించిన గ్యాలరీల వారిగా పాస్‌లను మంజూరు చేయాలన్నారు. ఏర్పాట్ల నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రిహార్సల్స్ నిర్వహించే నాటికి పూర్తి స్థాయి ఏర్పాట్లతో ప్రాంగణాన్ని సిద్దంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు.
సమావేశంలో మున్సిపల్ కమీషనర్ హెచ్‌యం ధ్యాన చంద్ర, ఆర్‌డివో భవానిశంకర్, డిసిపిలు గౌతమీశాలి, ఏబిటీఎస్ ఉదయరాణి, కె చక్రవర్తి, ఎసిపి కె. దామెదరావు, సమాచార శాఖ రీజనల్ ఇంజనీర్ సి.వి.కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి యు. వెంకట సుబ్బారావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ వి.కె. విజయశ్రీ, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, డియంఅండ్‌హెచ్‌వో యం. సుహాసిని, డిఐపిఆర్‌వో యు. సురేంద్రనాథ్, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, వియంసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. శ్రీనివాస్, ఎస్టేట్ ఆఫీసర్ టి.శ్రీనివాస్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.