Breaking News

ఈనెల 5, 6 తేదీల్లో జరిగే కలక్టర్ల సమావేశంపై సిఎస్ వీడియో సమావేశం.

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 5,6తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులతో శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను శాఖల వారీగా సమీక్షించారు.రానున్న 100 రోజుల కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసే విధంగా ప్రజెంటేషన్ ఉండాలని కార్యదర్శులకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన మినిట్ టు మినిట్ కార్యక్రమంపై చర్చించారు.5వతేది ఉ10గం. ల నుండి ఉ.11గం.ల మధ్య సియం,డిప్యూటీ సియం తదితరుల ప్రారంభ ఉపన్యాసాలు ఉంటాయని తదుపరి పలు అంశాలపై సమీక్ష ఉంటుందని అన్నారు.6వతేదీన కలెక్టర్లు,ఎస్పిలతో సంయుక్త సమావేశం ఉంటుందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు.

ఈవీడియో సమావేశంలో ఎంఏయుడి,వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్ సింఘాల్,యం.టి.కృష్ణబాబు,ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.ఆదినారాయణ,ప్రణాళికా శాఖ సంచాలకులు రాంబాబు, తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ,వ్యవసాయ, అటవీ,ఇంధన,గృహ నిర్మాణ, శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా,బి.రాజశేఖర్, అనంత రాము,కె.విజయా నంద్,అజయ్ జైన్,అదనపు డిజి కుమార్ విశ్వజిత్, సిసిఎల్ఏ జి.జయలక్ష్మి,ముఖ్య కార్యదర్శులు కాంతి లాల్ దండే,కె.సునీత,శశి భూషణ్ కుమార్,సురేశ్ కుమార్, కార్యదర్శులు కె.శశిధర్,సౌరవ్ గౌర్ తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *