Breaking News

రాష్ట్ర ప్రభుత్వ చొరవ తో ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు… : విక్టర్ బాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ జిల్లా లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ చొరవ తో ఉద్యోగులుగా మారనున్నా మహత్తర అవకాశం లభిస్తుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. జిల్లాలో 2022-23,2023-24 విద్య సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన వారు మరియు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అని ఆయన పేర్కొన్నారు.వీరికి జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ సంయుక్తంగా హెచ్.సి.ఎల్ – టెక్ బి వారి సహకారంతో గన్నవరం నియోజకవర్గం పరిధిలోని కేసరపల్లి లో హెచ్.సి ఎల్ ఆఫీస్ ఆవరణలో ఈ నెల 6వ తేదీ అనగా మంగళవారం నాడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విక్టర్ బాబు తెలిపారు.

ఉమ్మడి కృష్ణ జిల్లా లోని ఇంటర్ విద్యార్థులు ఈ జాబ్ మేళా లో పాల్గొనేందుకు ముందుగా https://bit.ly/TechbeeGoAP** ఈ లింక్లో రిజిస్ట్రేషన్ పక్రియా పూర్తి చేసుకోవాలని అనంతరం జాబ్ మేళా లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.తొలత క్యాట్ పరీక్ష , ఇంటర్వ్యూ చివరిగా ఇంగ్లీష్ స్కిల్ పరీక్ష నిర్వహించి ఎంపిక పూర్తి చేస్తారు.ఎంపికైన అభ్యర్థులకు సంవత్సర కాలం పాటు శిక్షణ ఇస్తారని ఆ కాలంలో 7వ నెల నుండి నెల కు 10 వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తారని విక్టర్ బాబు తెలిపారు.

స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ బైపైసీ, సి.ఈ.సి,హెచ్.ఏ.సి ఇతర ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్ విద్యతోనే విద్యార్థులు ఉద్యోగులుగా మారేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది అని ఆయన అన్నారు. అదే విధంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి పి. బి.సాల్మన్ రాజ్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు వీటిపై ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యాలు అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు.అనంతరం హెచ్.సి.ఎల్ లీడ్ మేనేజర్ పి గురునాథ్ మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు హెచ్.సి.ఎల్ తో తమ కెరీర్ ను ప్రారంభించే అవకాశాన్ని అభ్యర్థులు అందుపుచ్చుకోవాలని ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని కావున అభ్యర్ధులు జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *