మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులకు ఇది వరలో రావలసిన రాయితీ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసింది. ఈ మేరకు 2022-23 2023-24 సంవత్సరాలకు సంబంధించిన రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం (RKVY) క్రింద రైతులకు రావలసిన రాయితీ బకాయిలు ఇప్పటికే రు.20 లక్షలు నిధులు విడుదల చేసారు. తదనుగుణంగా జిల్లా స్థాయిలో నా ఆమోదంతో రైతుల ఖాతాలలో రాయితీ నిధులు జమ అయ్యేట్టు కార్యాచరణ కూడా జరిగింది. అదే విధంగా 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆయిల్ పామ్ పంటకు సంబంధించిన రాయితీ నిధులు 40 శాతం మేరకు రు. 113 లక్షలు విడుదల చేయటం జరిగింది. ఈ నిధులు కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యేట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. రైతులు ఈ విషయాలను గమనించగలరు.
అంతేకాకుండా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన శాఖ ద్వారా రైతులకు ఆర్థిక చేయుతగా వివిధ పంటలకు సంబంధించిన రాయితీలు ప్రకటిస్తూ విధివిధానాలు, మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం, కొబ్బరి అభివృద్ధి బోర్డు పథకం, ఎం ఐ డి హెచ్ పథకం, ఆయిల్ పామ్ పథకం ఈ నాలుగు పథకాల క్రింద రైతులకు అందించే రాయితీ వివరాలు ఈ క్రింద ఇచ్చిన పట్టిక లో చూడవచ్చు.
******** ఉద్యాన పంటలు వేసుకునే రైతులు సంబంధిత ఉద్యాన అధికారి ద్వారా ఈ పథకాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకుని దరఖాస్తులు చేసుకుని రాయితీలు పొందవలసినదిగా తెలియజేయడమైనది.
“ఉద్యాన పంటలకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు”
మైక్రో ఇరిగేషన్ పథకానికి కృష్ణా జిల్లాకు 1800 హెక్టార్లు భౌతిక లక్ష్యం నిర్దేశిస్తూ, 12.96 కోట్లు కేటాయింపు చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే వారం నుండి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించింది.