Breaking News

కుల వృత్తుల జీవనం సాగించే వారి ఆర్థిక సాధికారత లక్ష్యం గా పి ఎమ్ విశ్వ కర్మ యోజన

-క్షేత్ర స్థాయిలో గతంలో ఎటువంటి లబ్ది పొందని లబ్దిదారుల గుర్తింపు చేపట్టాలి
-కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కులవృత్తులు చేసుకుని జీవనం సాగించే వారి భద్రత, ఆర్థిక సాధికారికత స్వభావాన్ని పెంపొందించే విధంగా పి ఎమ్ విశ్వ కర్మ్స్ యోజన లబ్ధిదారుల ఎంపిక ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం విశ్వకర్మ యోజన నోడల్ ఆఫీసర్ల సమావేశంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ స్ధానిక సంస్థలు ఆధ్వర్యంలో కులవృత్తులు చేసుకునే వర్గాల వారి ఆర్థిక సాధికరికత పెంపొందించే దిశగా పిఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉందన్నారు. గ్రామ స్థాయిలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి అటువంటి వారిని గుర్తించి పేర్లు నమోదు చేయాలన్నారు. ఆయా వర్గాల వారికీ ఆయా కులవృత్తులలో నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహాయం, మార్కెట్ అనుసంధానం, హస్త కళాకారుల భద్రత , స్వభావరీత్యా అందచెయ్యవలసిన అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నైపుణ్యం పెంపొందించే దిశగా ఉపకార వేతనం తో కూడిన స్వల్ప కాలిక శిక్షణా , ఆయా కులవృత్తుల కోసం అవసరమైన టూల్ కీట్స్ అందచెయ్యడం ఈ పీఎం విశ్వకర్మ యోజన పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నారు.
వృత్తి కళాకారులను విశ్వకర్మగా గుర్తించడం,  పథకం కింద అన్ని ప్రయోజనాలను పొందేందుకు వారిని అర్హులుగా చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఆయా వర్గాల వారికీ బ్యాంకు ఋణ సౌకర్యం వారి ఐచ్ఛికత కు అనుగుణంగా అనుసంధానం చెయ్యాలని, బ్యాంకు ఋణ సౌకర్యం తప్పనిసరి కాదన్న విషయం గమనించాలని కలక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ లు లబ్దిదారుల గుర్తింపు అధికారం ఉందని, ఆమేరకు అర్హులకు గుర్తించు వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మునిసిపల్ ప్రాంతాల్లో ఆయా మునిసిపల్ కమిషనర్ లు డేటా నమోదు, పరిశీలన, కలెక్టర్ కి తదుపరి ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందన్నారు. అర్హులని గుర్తించే క్రమంలో పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్ లు, గ్రామీణ ప్రాంతాలలో ఎంపిడివోలు డేటా ఎంట్రీ పై దృష్టి పెట్టాలని, డివిజనల్ అభివృద్ధి అధికారులు పర్యవేక్షణ చేపట్టి టేలి కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చెయ్యాలని ఆదేశించారు

ఈ సమావేశానికి హాజరైన ప్రత్యేక ఆహ్వానితులు కాలేపు సత్య సాయిరాం మాట్లాడుతూ, పీఎం విశ్వకర్మ యోజన పథకం లబ్దిదారుల ఎంపిక, అర్హుల గుర్తింపు పారదర్శకంగా ఉండేలా చర్య లను చేపట్టాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో 79 వేల మంది ని గుర్తించగా 65 వేల మందికి పైగా డేటా పరిశీలన చేసినట్లు జిల్లా పరిశ్రమల అధికారి పికేపి ప్రసాద్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 63 వేల మందినీ గుర్తుంచగా డేటా ఎంట్రీ జరుగుతున్నట్లు వివరించారు.

సమావేశంలో ప్రత్యేక ఆహ్వానీతులు కాలేపూ సాయిరాం, ఇంచార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి పికేపి ప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కొండల రావు, డి ఆర్ డీ ఏ పిడి ఎన్వివిఎస్ మూర్తి,  డి ఎల్ డి ఓ పీ. వీణాదేవి, వి. శాంతా మణి, ఎల్ డి ఎమ్ డివి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *