-ఉభయ గోదావరి జిల్లాల్లో హెల్మెట్ ధారణ చేసి మాత్రమే వాహనాలు నడపండి
-డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాహన చోదకులు హెల్మట్ ధారణ పట్ల నిర్లక్ష్య వైఖరీ అత్యంత ఆవేదనా కలిగించే అంశం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు, హై కోర్టు వారు శిరస్త్రాణం (హెల్మెట్), సీటు బెల్ట్ ధారణ పై ఎన్ని రకాలుగా చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి సరియైన స్పందన రాకపోవడం బాధాకరం అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చట్టాల పట్ల అవగాహన సదస్సు లని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ నిర్వహిస్తున్నా మన్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హెల్మెట్ ధారణ పై తాండవ యోగేష్ వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ కేసు విషయంలో హెల్మెట్ ధారణ పై ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో 3703 మోటార్ సైకిల్ వాహన ప్రమాదాలు జరిగితే అందులో 3047 మంది మరణించడం అత్యంత బాధకరమైన సంఘటన గా పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
హై కోర్టు వారి ఆదేశాల అనుసారం డి ఎల్ ఎస్ ఎ ద్వారా హెల్మెట్ ధారణ పై అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కె. ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఆగస్ట్ 4 వ తేది నుంచి హెల్మెట్ ధారణ తప్పని సరి చేస్తూ, అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం చేపట్టేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్ట్స్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం వారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ఆమేరకు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్పూర్తి ప్రదాత నిలవడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధారణ చెయ్యాలని, పట్టణాలను నుంచి గ్రామాల వరకూ వాహన చోదకులు తప్పని సరి గా చట్టాలనీ గౌరవిస్తూ, మోటారు వాహనాల చట్టాలను అనుసరించాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో చట్టపరంగా శిక్షార్హులు గా మాత్రమే కాకుండా అపరాధ రుసుం కూడా గురికావలసి వస్తుందనీ పేర్కొన్నారు.