-సుమారు మూడు లక్షల అపరాధ రుసుము వసూలు
-డి టి వో కృష్ణా రావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత 2024 విద్యా సంవత్సరము ప్రారంభము కావడంతో స్కూల్ పిల్లలు వారికి సంబందించిన స్కూల్ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణించడం జరుగుతున్నదని , అటువంటి వారిపై 50 కేసులు నమోదు చేయడమే కాకుండా సుమారు 3 లక్షల రూపాయల అపరాధ రుసుము వసూలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి కె ఎస్ ఎమ్ వి. కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో పలు ప్రతికూల వార్తలు నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోల వెనుకటి భాగంలో స్కూల్ బ్యాగ్స్ పెట్టే స్థలంలో ఆటో డ్రైవర్లు స్కూల్ పిల్లలను కూర్చోబెట్టి నడపడం వలన మరియు పరిమితికి మించి స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తుండడంతో అటువంటి ఆటోలు ప్రమాదాలకు కారకంగా మారుతున్నట్లు గుర్తించామన్నారు.
ఈ నేపథ్యంలో స్కూల్ కి పిల్లల్ని తీసుకుని వెళ్ళే ఆటోలపై శ్రద్ద వహించి ఏవరైన మోటారు వాహనాల చట్టాల ఉల్లంఘన కు పాల్పడినా , నియమ నిబంధనలు పాటించని వాటిని కనుగొనబడిన జిల్లా లోని మోటార్ వాహనముల తనిఖీ అధికారులు కేసులు నమోదు చేయడం జరుగుచున్నదనీ తెలిపారు..అందులో భాగంగా, యిప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 50 కేసులు నమోదు చేసి వారి నుంచి రూ.2,87,700/- అపరాధ రుసుం వసూలు వసూలు చేయడం జరిగినదని తెలిపారు. తల్లితండ్రులు కూడా వారి పిల్లల్ని పంపే ఆటో లలో పరిమితికి మించి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా రవాణా అధికారి కృష్ణా రావు కోరారు.