-బుద్ధావెంకన్న కార్యాలయంలో ఘనంగా ఎంపి బర్త్ డే వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చి మ నియోజకవర్గ సమస్యలు ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న,రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాతో కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కార్యాలయంలో శనివారం ఎంపి కేశినేని శివనాథ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపి కేశినేని శివనాథ్ కేక్ కట్ చేయగా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా శుభాకాంక్షలు తెలిపారు. ఎంపి కేశినేని శివనాథ్ ను నాగుల్ మీరా శాలువాతో సత్కరించగా, బుద్ధా వెంకన్న చిత్రపటం బహుకరించారు.
ఈ సందర్బంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఎంపి గా కేశినేని శివనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించాలని, ఆయన ఎంపి గా వుండే ఆ పదిహేను సంవత్సరాలు పుట్టిన రోజు వేడుకలు ఇక్కడే జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచే మొదలైందని గుర్తు చేసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుంటానని తెలిపారు. దుర్గా మల్లేశ్వరస్వామి అమ్మవారి దేవస్థానం కోసం కేంద్రం నుంచి వందకోట్ల రూపాయల సాయం కేంద్ర పర్యాటక సంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ ను అడగ్గా, దశల వారీగా మూడు సంవత్సరాల్లో ఆ నిధులు మొత్తం విడుదల చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమస్యలు తీర్చేందుకు ఎప్పుడు అందుబాటులో వుంటానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకి కృతజ్ఙతలు తెలిపారు.