గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి బ్యాంకులు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన 20 ఏసీలను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ , జిల్లా కలెక్టర్ ఎస్ . నాగలక్ష్మీ శనివారం సాయంత్రం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి కి అందించారు. ఇటీవల జరిగిన జిల్లా బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రాష్ట్రంలోని పేద ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలను అందిస్తున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి బ్యాంకర్లు సి ఎస్ ఆర్ నిధుల ద్వారా ఏసీలు అందించాలని లీడ్ బ్యాంకు మేనేజర్ ను ఇతర బ్యాంకుల ప్రతినిధులను కోరారు. దీనికి స్పందిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఐదు, ఏసీలు, ఇండియన్ బ్యాంకు వారు ఐదు ఏసీలు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వారు నాలుగు ఏసీలు ,బ్యాంక్ ఆఫ్ బరోడా వారు మూడు ఏసీలు, ఐసిఐసిఐ బ్యాంకు వారు మూడు ఏసీలు మొత్తం 20 ఏసీలను గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గళ్ళా మాధవి, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, జి జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజిఎం ఎస్ జవహర్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ఇండియన్ బ్యాంక్ డీజిఎం డిఎస్ మూర్తి బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ కిరణ్ రెడ్డి యూనియన్ బ్యాంక్ ఎటిఎం అశ్వత్ నాయక్ లీడ్ డిస్టిక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …