గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
త్రాగునీటి సరఫరా సమయంలో శ్యాంపిల్స్ తప్పనిసరిగా తీయాలని, ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా జరిగితే యుద్దప్రాదిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సిడిఎంఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి పరిధిలో వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులు ప్రతి రోజు త్రాగునీటి సరఫరా సమయంలో తప్పనిసరిగా శ్యాంపిల్స్ తీయాలన్నారు. ఎక్కడైనా త్రాగునీరు కలుషితం అయినట్లు గుర్తిస్తే యుద్దప్రాతిపదిన చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి కాలుష్యం పై అందే ఫిర్యాదులను అధిక ప్రాధనత్యతో పరిష్కరించాలని స్పష్టం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ల మరమత్తు పనులపై రోజువారీ పురోగతి రిపోర్ట్ ఇవ్వాలని, సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రధాన అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత ఎక్కడైనా పెండింగ్ ఉంటె వెంటనే తీయించాలని, సోమవారం నాటికి పూడికతీత పై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. నగరంలో ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్యం కీలకమని, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలన్నారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి, వాటిని తొలగించాలని, శానిటరీ ఇన్స్పెక్టర్ డివిజన్ల వారీగా మెరుగైన పారిశుధ్యానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విభాగాల వారీగా ఏ అర్జీ, దరఖాస్తు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలన్నారు. పెండింగ్ ఉన్న ఆర్జీలను తక్షణం పరిష్కారం చేయాలని, టెక్నికల్ సమస్యలు ఉన్న వాటిని సిడిఎంఏ టెక్నికల్ టీంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, ఎస్.ఈ. ఎం.శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …