గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్నిపరిశుభ్రంగా ఉంచడంలో ఆదర్శంగా ఉండాలని, నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, మేనేజర్ ప్రసాద్ లతో కలిసి జిఎంసి ప్రధాన కార్యాలయాన్ని, పార్కింగ్ పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి ప్రధాన కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఇతర కార్యాలయాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఇప్పటికే వినియోగంలో లేని బీరువాలు, బల్లలు సూపర్వైజరి అధికారుల పర్యవేక్షణలో వెహికిల్ షెడ్ కి తరలించడం జరిగిందన్నారు. అన్ని విభాగాల్లో వినియోగంలో లేని వస్తువుల వివరాలను విభాగాధిపతి సమక్షంలో రిపోర్ట్ చేసి, వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినియోగంలో లేని వస్తువులను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిలో కార్యాలయానికి సంబందించిన ఏ ఫైల్ లేకుండా చూడాలని, తరలించే సమయంలో వీడియోలు, ఫొటోలు తీయాలని స్పష్టం చేశారు. అలాగే పార్కింగ్ అభివృద్ధి పనులను తనిఖీ చేసి, పార్కింగ్ కు కేటాయించిన స్థలంలో కొంత మేర మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Tags guntur
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …