-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయంలో జరుగుతుందని ఈ సోమవారం కూడా ప్రజలు తమ సమస్యలను ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో అందించగలరని, సర్కిల్ల పరిధిలో కూడా ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు సర్కిల్ కార్యాలయాల్లో కూడా తమ అర్జీలని అధికారులకు అందించవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.