Breaking News

54 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 54 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, గుంటూరు వారి ఉత్తర్వుల నోటిఫికేషన్ నెం. 01/2023 , తేది.25-03-2023 మేరకు 34 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. పిటీషనర్లు హై కోర్టులో కేసు విత్ డ్రా చేసుకున్నందున మిగిలిన 20 పోస్టులకు తేది.06-08-2024 నుండి 13-08-2024 వరకు గుంటూరు లోని జే.సి కాలేజీ ఆఫ్ లా, సిద్దార్ధ నగర్ గుంటూరు లో రీడ్ & రైట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, గుంటూరు వారు పేర్కొన్నారు. వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకున్న 5,116 మంది అభ్యర్ధులకు దిగువ తెలిపిన విధంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వెబ్ పోర్టల్ నందు పరీక్షకు హాజరగు అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ నెంబర్లు, వారు హాజరు కావలసిన తేది మరియు సమయం పేర్కొనడం జరిగింది.

S.No Name of the post No.of posts notified No.of applications received Aptitude Test date
01 Drain Cleaner 1 86 06-08-2024 ఉదయం
02 Gang Mazdoor 2 385 06-08-2024 మధ్యాహ్నం
03 Public Health Worker 12 2840 07th , 08th & 09th ఉదయం & మధ్యాహ్నం
04 Sweeper 3 974 12-08-2024 ఉదయం & మధ్యాహ్నం
05 Whole time servant 1 235 13-08-2024 ఉదయం
06 Kalasi 1 596 13-08-2024 మధ్యాహ్నం
Total 20 5116

పై తెలిపిన తేదీలలో పరీక్షలు ఉదయం పూట 10.30 గంటలకు , మధ్యాహ్నం 2.00 గంటలకు నిర్వహించడం జరుగుతుందని , అభ్యర్డులు ఉదయం పూట పరీక్షకు 9.30 నుండి గ్రెస్ పిరియడ్ తో కలుపుకొని 10.30 గం. లకు , మధ్యాహ్నం 1 గం నుండి గ్రెస్ పిరియడ్ తో కలుపుకొని 2 గం.లకు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు. డిఈఓ అభ్యర్డుల ఒరిజనల్ ఆధార్ ఐడి వెరీఫై చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని , నగరపాలక సంస్థ అధికారులు పరీక్షా కేంద్రంలో అభ్యర్డులకు త్రాగునీరు అందుబాటులో వుంచాలని, అలాగే శానిటేషన్ చేపట్టాలన్నారు. విద్యుచ్ఛక్తి అధికారులు విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ , ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో వుంచాలని, ఆర్ టీసీ అధికారులు రైల్వే స్టేషన్ , బస్ స్టేషన్ నుండి అవసరం మేరకు అభ్యర్డులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి బస్సులు నడపాలని, పోలీసు శాఖ అధికారులు 6 వ తేది నుండి 13 వ తేది వరకు పరీక్ష కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు వారికి కేటాయించిన విధులను తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *