మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరంలో ఆగస్టు 5 న జరగనున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APMPA) సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలంటూ జర్నలిస్టులకు ఏపీ ఎంపిఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పసుపులేటి చైతన్య విజ్ఞప్తి చేశారు. మైలవరంలోని స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫంక్షన్ హాల్లో జరుగునున్న ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకటరమణ అధ్యక్షతన జరగనున్నదనీ ఈ కార్యక్రమాలలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారన్నారు.
వీరితోపాటు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య ), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లతో పాటు ఆంధ్రప్రదేశ్ మీద ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర, నగర నాయకులు హాజరు కానున్నారన్నారు. ఈ సర్వసభ్య సమావేశానికి ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, మండలాల నుండి పాత్రికేయ మిత్రులు పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ యంపీఏ.రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పసుపులేటి చైతన్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మట్టా రవికుమార్ మైలవరం నియోజకవర్గ ఏపీయంపిఏ అధ్యక్షులు మట్టా రవి కుమార్, ఏ.పి.ఏం.పి. ఏ.జిల్లా ముఖ్య నాయకులు బొడ్డు విజయబాబు (ప్రెస్ క్లబ్ అధ్యక్షులు), మైలవరం నియోజకవర్గం ఏపీయంపిఏ సెక్రెటరీ టంగుటూరి శ్రీనివాస్, మల్లెల శ్రీనివాస్ మరియు ఏపీ యంపిఏ నాయకులు సోమవరపు చిట్టిబాబు, పరంగి మురళి బాబు, వీసం సురేష్ బాబు, తుపాకుల హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News