గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు నిర్దేశిత సమయంలో చేయాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ప్రజారోగ్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ అమరావతి రోడ్, గోరంట్ల, బృందావన్ గార్డెన్స్, కొరెటేపాడు, లక్ష్మీపురం, బ్రాడిపేట, పట్టాభిపురం తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను, కార్మికులు, కార్యదర్శుల హాజరుని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులు ప్రతి రోజు ఒకే సమయానికి చెత్త సేకరణ చేయాలని, ప్రజలకు కూడా సదరు సమయంపై అవగాహన కల్గించడం ద్వారా వారు రోడ్ల మీద, కాల్వల్లో వేయకుండా ఉంటారన్నారు. అలాగే శానిటేషన్ కార్యదర్శులు తప్పనిసరిగా ఉదయం నిర్దేశిత సమయానికి విధులు హాజరు కావాలన్నారు. కమర్షియల్ సంస్థలు ప్రజారోగ్య కార్మికులు రోడ్లు శుభ్రం చేసిన అనంతరం షాప్ లు శుభ్రం చేసుకొని, వ్యర్ధాలను రోడ్ల మీద వేస్తున్నారని, వారికి తప్పనిసరిగా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని తెలియచేయాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్ యాక్షన్ ప్లాన్ ఉండాలని, ప్రధాన రహదార్లు ఉదయం 7 గంటలకల్లా శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలను రోడ్ల మీద వేయకుండా ఇంటి వద్దకు వచ్చే నగరాపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులకు అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. పర్యటనలో ఎంహెచ్ఓ మధుసూదన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …