బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణ నిర్మూలన లక్ష్యంగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేయాలి.

-చైల్డ్ లైన్ 1098 లేదా 9492555064, 9492555065, 9492555066, 9492555067 ఫిర్యాదు చేయండి
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ ప్రదేశాల్లో బాల కార్మికులు గా పని చేస్తున్న వారిని గుర్తించే విధంగా ముమ్మర తనిఖీలను చేపట్టి ఆయా యాజమాన్యాలపై, వ్యక్తులు పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశనికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సంపూర్ణ నిర్మూలన దిశగా జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ పనిచేయాలన్నారు. జిల్లాలో బాల కార్మిక నిర్మూలన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ముమ్మర తనిఖీలను నిర్వహించి వివిధ సంస్థల్లో, ప్రదేశాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికులు ఎక్కువగా డాబా హోటల్స్ బార్ అండ్ రెస్టారెంట్లు, ఇటుక బట్టీల్లో పనిచేస్తుంటారని అటువంటి ప్రదేశాలను నిరంతరం కమిటీ సభ్యులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఇళ్లల్లో పనిచేసే బాల కార్మికులు, ప్రధాన రహదారుల కూడలి ప్రాంతాల్లో, సిగ్నర్స్ వద్ద భిక్షాటన చేసే బాలలను గుర్తించడం , బాల కార్మికల పని నుంచి విడుదల చేయించి జువైనల్ హోమ్ తదితర పునరావాస కేంద్రాల్లో చేర్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికుల సమాచారాన్ని తెలియజేసేందుకు చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సమాచారాన్ని అందించాలన్నారు. బాల కార్మికులు ఎక్కడైనా పని చేస్తునట్లయితే సహాయ కార్మిక అధికారులు 9492555064, 9492555065, 9492555066, 9492555067 వారికి తెలియ చేయవలసినదిగా సహాయ కార్మిక కమిషనర్ వలి ఈ సందర్భంగా కోరారు . ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గే , డిఆర్ఓ ఇన్చార్జి జెసి జీ. నరసింహులు, జిల్లా లేబర్ ఆఫీసర్ బిఎస్ఎమ్ వలి, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *