మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స గురించి సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు  మాట్లాడుతూ మానసిక రుగ్మతల తో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకలు గురించి, ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ఎలాంటి న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహకారం అందిస్తామన్నారు.. ఈ కార్యక్రమం లో ఉమ్మడి తూర్పుగోదావరి కి చెందిన వైద్య అధికార్లు, డి.ఎమ్ అండ్ హెచ్.ఓ. అధికార్లు, వికలాంగుల మరియు సంక్షేమ అధికార్లు, కలెక్టరేట్ సిబ్బంది, పోలీసు అధికార్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *