రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణలో భాగంగా ట్రాఫిక్ , రైల్వే , బస్సు ప్రయాణికులు, పుష్కర్ ఘాట్స్ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భం కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ పుష్కర ఘాట్స్ కు వచ్చే సాధారణ భక్తులకు, వీఐపీలకు ఘాట్ లకు వొచ్చే ట్రాఫిక్ నియంత్రించే విధంగా వేర్వేరు మార్గాలను కేటాయించాలన్నారు. రైలు ప్రయాణం ద్వారా గోదావరి పుష్కర యాత్రకు వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని, ముందుగానే అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని, అవసరాన్ని బట్టి ధవలేశ్వరం వైపు నుంచే వచ్చే ట్రాఫిక్ ను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా అధికారులు కమిటీలు సమన్వయంతో రద్దీ లేని పుష్కర ఘాట్స్ కు, రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం ద్వారా వచ్చే వారిని తరలించే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. పుష్కర్ ఘాట్స్ వెళ్లే మార్గాలకు సంబంధించి రోడ్ రూట్ మ్యాప్స్ ను, ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుగుణంగా నూతన రోడ్స్ ఏర్పాటుపై ట్రాఫిక్ డైవర్షన్ పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బయటి నుంచి వచ్చే వాహనాలను నిర్దేశించిన ప్రదేశాల్లో ఆపి అక్కడి నుంచి పుష్కర్ భక్తులను బస్సుల్లో పంపించే విధంగా ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునన్నారు. భక్తులు పుష్కర్ ఘాట్స్ కి వెళ్లే మార్గం బయటికి వచ్చే మార్గం ఆయా రూట్ మ్యాప్ లో ద్వారా విడి విడిగా అందరికీ తెలిసే విధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చెయ్యాలని ఎస్పీ డి. నరసింహ కిషోర్ పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా భక్తులను బయటకు పంపించే విధంగా మ్యాప్లను రూపొందించా లన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన అన్ని కమిటీలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గే, ట్రాఫిక్ డిఎస్పి ఎం వెంకటేశ్వర్లు, ఆర్ ఎం సి ఎస్ ఈ జి పాండురంగారావు, ఆర్ అండ్ బి ఈ ఈ ఎస్ వి బి రెడ్డి డిపిఓ ఎం రాంబాబు. ఏపీఎస్ఆర్టీసీ డి పి టి ఓ ఎం షర్మిల అశోక్, డిటిఓ కేఎస్ఎంవి కృష్ణారావు, ఆర్డీవో రాజమండ్రి ఎఫ్ఎసి కేఎల్ శివ జ్యోతి, ఎస్సీ ఇరిగేషన్ జి శ్రీనివాసరావు, ఆర్ ఐ ఓ.. ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …