Breaking News

ఎ.పి.యన్.జి.జి.ఓస్ రాష్ట్ర కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం


-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ అండగా ఉంటుంది:పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్
-దివ్యాంగ ఉద్యోగులను 2023లో విడుదల చేసిన జి.ఓ ప్రకారం ఫీల్డ్ విధుల నుండి విముక్తి కల్పించేలా కృషి చేస్తాం:ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో దివ్యాంగ ఉద్యోగుల ప్రతినిధి పి.అశ్వర్థప్ప ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిధులుగా హాజరైన ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ,దివ్యాంగ ఉద్యోగులకు కన్వెయన్స్ అలవెన్సు పెంపుదలకు సంభందించి ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ తరపున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని,దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యోగులు కోరిన విధంగా సంక్షేమ నిధి గురించి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొని వెళ్తామని,అలాగే సంఘం యొక్క ఆవశ్యకత గురించి వివరించారు.

మరో ముఖ్య అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ దివ్యాంగ ఉద్యోగుల హక్కులను 2016 చట్ట ప్రకారం పరిరక్షణ కల్పించడం కోసం కృషి చేస్తామని తెలిపారు.అదేవిధంగా క్షేత్ర స్థాయిలో అవుట్ డోర్ విధులనుండి దివ్యాంగ ఉద్యోగులను విముక్తి కల్పించి కార్యాలయాలలో అంతర్గత విధులలో మాత్రమే నియమించేలా 2023 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కృషి చేస్తామని,అలాగే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులకు మేలు చేసేలా చేపట్టిన మార్పులను స్వాగతిస్తున్నామని,గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ శాఖలలో ఉన్న ఖాళీలలో పదోన్నతులు కల్పించి అర్హత ప్రకారం అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు పి.అశ్వర్థ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.కాశీ విశ్వనాధ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రామాంజనేయులు,అదనపు కార్యదర్శి ప్రేమ్ సుధాకర్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రోజా ప్రకాష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యస్.కె.సుభాని,యన్.రాజేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *