విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగా మరియు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు, ఐ.పి.ఎస్ వారి అదేశాల మేరకు, ట్రాఫిక్ డి.సి.పి. కే.చక్రవర్తి పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎ.డి.సి.పి. డి.ప్రసాద్ అధ్వర్యంలో శనివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు విజయవాడ నగరంలోని ద్విచక్ర వాహన మెకానిక్ లకు మరియు డిస్ట్రిబుటర్స్ తో మీటింగ్ నిర్వహించి, వారికీ రహదారి భద్రతా నియమాలు , MV Act చట్టాల మీద అవగాహన కల్పించారు. అంతే కాక నగరంలో యువకులు వారి ద్విచక్ర వాహనములకు శబ్ద కాలుష్యము చేయు సైలేన్సర్స్ బిగించి రహాదారులపై తిరుగుచూ ప్రజలకు ఇబ్బంది కలుగచేయుచు భయ బ్రాంతులకు గురిచేయు చున్నందున, సదరు అంశంపై ఈ క్రింది సూచనలు చేశారు.
-కంపెనీ అమర్చిన సైలెన్సర్ తప్ప, వాహన దారుడు ఆన్ లైన్ లో కొన్నవి గాని, ఇతర రాష్ట్రముల నుండి కొన్నవి శబ్ద కాలుష్యము కలుగ చేయు వాటిని బిగించరాదు.
-శబ్ద కాలుష్యము చేయు సైలెన్సర్స్ మార్చమని వాహన దారులు ఒత్తిడి చేసిన యెడల పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహాయం పొందవలయును.
-శబ్ద కాలుష్యము చేయు సైలేన్సర్స్ బిగించమని వచ్చిన వారి వద్ద నుండి వారి సి-book తప్పని సరిగా జిరాక్స్ తీసుకోనవలయును.
-ఎవరైనా వాహన దారులు అనుమానా స్పద పరిస్థితులలో వాహనము రిపేరు చేయమని వచ్చిన సందర్భములో వారి సి-book తప్పని సరిగా చూసి రిపేరు చేయవలెను.
-పోలీసు వారి తనిఖీలో శబ్ద కాలుష్యము కలుగ చేయు వాహనములను పట్టుకోన్నప్పుడు , వాహన దారులతో పాటు దానిని బిగించిన మెకానిక్ పై కుడా జరిమానా విధించ బడును.
కావున ద్విచక్ర వాహన మెకానిక్ లు పై సూచనలు పాటించి విజయవాడ పోలీసు వారికి సహకరించి ప్రజలకు కలిగే అసౌకర్యం నివారించుటలో తమ వంతు సహకారం అందించవలసిందిగా కోరారు.