-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేసే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో సదరు ప్రక్రియలో భాగంగా ఉద్యోగ సంఘాలతో కూడా సమావేశం నిర్వహించి క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను ఉద్యోగుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని మార్పులను చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మార్పులు చేయవలసిందిగా కోరుతూ అదే విదంగా సచివాలయ వ్యవస్థ లో మార్పులు మేము స్వాగతిస్తున్నామని ప్రభుత్వం చేపట్టే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములై ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నాగ మోహన్ సురేష్ దామోదర్ రెడ్డి వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.