విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికపై నిధులు కేటాయించి బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేసి చేతి వృత్తి దారులు ఆత్మగౌరవంతో జీవించే విధంగా నూతనంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శనివారం విజయవాడలో దాసరి భవన్ లో సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య అధ్యక్షతన జరిగిన చేతి వృత్తి దారుల సమాఖ్య రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా వృత్తిదారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి నిధులు కేటాయించకుండా వృత్తిదారుల సంక్షేమాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని దీని వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆ విధంగా కాకుండా నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం చేతి వృత్తిదారుల సంక్షేమానికి చిత్త శుద్ధితో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం మత్స్య కార్మికులకు ఆన్లైన్ ద్వారా వేలం వేసి చేపలు పట్టే జీవో 217 ను నూతన ప్రభుత్వం రద్దు చేయడం హర్షనీయమని తెలిపారు.ముఖ్య అతిథి గా పాల్గొన్న అఖిల భారత మత్స్య కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు జె వి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో మనుగడలో ఉన్న చేతి వృత్తులను గుర్తించి చేతి వృత్తి దారులు ఎదుర్కొంటున్న సమస్యలను క్రింది స్థాయిలో స్థాయిలోకి వెళ్లి అధ్యయనం చేసి వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వృత్తి సంఘాలను ఏర్పాటు చేసి కృషి చేయాలని కోరారు.
సముద్ర తీర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన కోస్టల్ రెగ్యులేటర్ జోన్ విధానం వల్ల 500 మీటర్ల వరకు చేపలు పట్టేపట్టే వేటను 50 మీటర్లకు కుదించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రద్దు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాలుగా చేనేత కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగలేదని తక్షణమే సంఘాలకు, సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని, మగ్గం వేసే ప్రతి చేనేత కార్మికునికి నేతన్న నేస్త0 పథకం అమలు చేయాలని, చేనేత కార్మికులతో పాటు ఇతర చేతి వృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందజేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా చెరువులను మత్స్య కార్మికులకు చేపలు పట్టుకునేందుకు కేటాయించాలని, రజకులకు దోబీ ఘాట్ ల ను కబ్జాలకు గురి కాకుండా కాపాడాలని, దోబీగాట్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని, బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా చేతి వృత్తిదారులందరికీ సబ్సిడీ రుణాలు చేయాలని, పనిముట్లు అందజేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టుముక్కల బాలాజీ, ఏపీ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగాంజనేయులు, ఏపీరజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బుద్ధారపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …