విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. సుజనా ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సుజనా మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గత వైసిపి పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు రాక నిరుద్యోగం భారీగా పెరిగింది అన్నారు. జాబ్ మేళాకు ఏడు వేల పైచిలుకు నిరుద్యోగులు హాజరయ్యారని, 1680 మంది మొదటి విడతగా ఉద్యోగాలు పొందారని మరో 2400 మందిని మరికొద్ది రోజుల్లో నిర్వహించే రెండవ జాబితాలో నిర్వాహకులు ఎంపిక చేస్తారని తెలిపారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వు కాపీలను అందజేశారు. (మోదీ కౌశల్ వికాస్ యోజన) ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధిని మెరుగుపరుస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి సహకారంతో విజయవాడ పార్లమెంటు పరిధిలో అనేక కంపెనీలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కలుపుకునే ద్యేయంగా కృషి చేస్తామన్నారు.సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించామని రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ చింతపల్లి అజయ్, మోహన్ వంశీ, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పైలా నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎం ఎస్ బేగ్, జనసేన నాయకులు బాడిత శంకర్, యేదుపాటి రామయ్య, రౌతు రమ్య ప్రియ, తిరుపతి అనూష, బొమ్ము గోవింద లక్ష్మి, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …