రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జైళ్ళ శాఖకు చెందిన రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా నిర్మించిన ప్రిజన్ కేఫ్,బాక్స్ క్రికెట్ మరియు తూర్పుగోదావరి జిల్లా సబ్ జైళ్ళ అధికారి వారి కార్యాలయం పక్కన నిర్మించిన పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత 12-82024న అనగా సోమవారం ప్రారంభించనున్నట్లు కేంద్రకారాగారం పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షణకు హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ శ కుమార్ విశ్వజిత్ ఆదివారం నగరానికి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రకారాగారము నందు వికలాంగులకు కృత్రిమ అవయవాలను హోం మంత్రి వంగలపూడి అనిత అందచేయనున్నారు. ఈ కార్యక్రమంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసంబ్లి ఆదిరెడ్డి శ్రీనివాస్, పర్యటన శాఖా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి, ఎస్పి డి. నరసింహ కిషోర్, డి.ఐ.జి. ఆఫ్ ప్రిజన్స్ ఎం ఆర్ రవి కిరణ్, ఐ జి ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ ఐ. శ్రీనివాస రావు, , రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ , కేంద్రకారాగారము పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ , జైళ్ల శాఖ అధికారులు గార్దింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన నున్నారు.
Tags rajamandri
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …