విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర రావు ఇచ్చిన పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యములో గూడూరు నుండి అనకాపల్లి వరకు అన్ని రైల్వే కార్యాలయముల ముందు నూతన పెన్షన్ విధానం రద్దు, కరోనా సమయంలో ఫ్రీజ్ చేసిన 18 నెలల DA ను తిరిగి చెల్లించాలని, ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడం జరిగింది . దీనిలో భాగంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఆవరణలో ఈ రోజు సాయంత్రం గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిజనల్ సెక్రెటరీ కామ్రేడ్ లీల మాట్లాడుతూ, కరోనా సమయంలో వ్యవస్థలు అన్ని స్తంభించి పోయినప్పుడు కేవలం రైల్వే కార్మికులు మాత్రమే పని చేసి శ్రామిక స్పెషల్స్ మరియు కిసాన్ స్పెషల్స్ నడిపి దేశ వ్యాప్తముగా నిత్యావసర వస్తువులను రవాణా చేసారని తెలియ చేసారు. ప్రాణాలకు తెగించి పని చేసిన రైల్వే కార్మికులను కరోనా వారియర్స్ గా గుర్తించకపోవడం అన్యాయమని విమర్శించారు. కరోనా సమయములో దేశ ఆర్ధిక పరిస్థితి సంక్షోభములో ఉన్నది అని చెప్పి 18 నెలల పాటు రైల్వే కార్మికుల తో బాటుగా చరిత్రలో ఎప్పుడు లేని విధముగా పదవీ విరమణ చేసిన కార్మికుల పెన్షన్ లో కూడా కోత కోసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే అని విమర్శించారు . ఈ రోజు భారతీయ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచం లోనే మూడవ అతి పెద్ద వ్యవస్థ గా ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి పని చేసిన రైల్వే కార్మికులకు, పెన్షనర్లకు ఫ్రీజ్ చేసిన DA తిరిగి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ GN శ్రీనివాస రావు మాట్లాడుతూ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సు ను వెయ్యి రూపాయల నుంచి 3 వేల రూపాయలకు పెంచాలని పార్లమెంట్ సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేయడం అన్యాయమని విమర్శించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు చర్యలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్ నకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ప్రెసిడెంట్ రామ గుప్త, సహాయ డివిజనల్ కార్యదర్సులు శేఖర్ బాబు, పాములు, లోకల్ బ్రాంచ్ సెక్రెటరీస్ వెంకటేశ్వర రావు , అహ్మద్ షెరీఫ్, శ్రీనివాస రావు, భాను బాబు, సుధీర్, పవన్ కుమార్, షౌకత్ అలీ, క్రాంతి కుమార్, పెద్ద సంఖ్యలో యువ కార్మికులు , మహిళా కార్మికులు మరియు పెన్షనర్లు పాల్గొని విజయవంతం చేశారు. ప్రదర్శన అనంతరం సమస్యల సత్వర పరిష్కారానికి డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ నరేంద్ర ఆనంద రావు పాటిల్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజనల్ కోశాధికారిణి RM లక్ష్మి వందన సమర్పణ చేశారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …