Breaking News

రెవిన్యూ సదస్సులకు ఆర్ పి సిసోడియా

-విజయనగరం, విశాఖలలో నాలుగు రోజుల పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవిన్యూ సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ఆర్ పి సిసోడియా స్వయంగా హాజరవుతున్నారు. పదహేనవతేదీ సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుని, 16వ తేదీ ఉదయం విజయనగరం వెళతారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోనే అందుబాటులో ఉండి అక్కడి రెవిన్యూ సదస్సులను అకస్మికంగా సందర్శిస్తారు. కనీసం సాయంత్రం లోపు రెండు, మూడు సదస్సులకు హాజరుకావాలని సిసోడియాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తిరిగి రాత్రికి విశాఖపట్నం చేరుకుని 17వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు విశాఖపట్నంలో బస చేస్తారు. స్దానికంగా ఉన్న శాసనమండలి ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకుని రెవిన్యూ సదస్సులకు నేరుగా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. అయితే విశాఖపట్నం కలెక్టరేట్ తో సహా స్దానిక రెవిన్యూ కార్యాలయాలను సందర్శించి ప్రభుత్వ ప్రాధాన్యతలపై అధికారులతో సమావేశం అవుతారు. మదనపల్లి సంఘటన నేపధ్యంలో అయా కార్యాలయాలలో రెవిన్యూ దస్త్రాల భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 18వ తేదీ ఉదయం విశాఖపట్నం నుండి రోడ్డు మార్గంలో బయలు దేరి విజయవాడ చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *