Breaking News

స్పష్టతతో అర్జీలను పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి – జాయింట్ కలెక్టర్ నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను పారదర్శకంగా నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అధికారులను సూచించారు. క‌లెక్ట‌రేట్లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో సోమ‌వారం నిర్వహించిన ప్రజా సమస్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ నిధి మీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభం కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, జిల్లా పౌరసరఫరాల డిఎం. జి. వెంకటేశ్వర్లు, కెఆర్ఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ. కిరణ్మయి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ ప్రజా సమస్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలపై అలసత్వం ప్రదర్శించకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారుడు ఎదుర్కుంటున్న సమస్యలను బాధ్యతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర‌స్థాయి అధికారుల‌ స‌మ‌న్వ‌యంతో అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మంలో మొత్తం 141 అర్జీలు అంద‌గా.. వీటిలో రెవెన్యూ-35, మునిసిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, ప‌ట్ట‌ణాభివృద్ధి-37, పంచాయ‌తీరాజ్‌-7, పోలీస్‌-21, డీఆర్‌డీఏ-9, అటవీ శాఖ -1, వైద్యఆరోగ్యం-1, సర్వే సెట్టిల్మెంట్-4, స‌హ‌కార శాఖ-2, విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమం-1, విద్య‌-1, గృహ నిర్మాణం -2, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్‌-2, ఏపీఎస్ఆర్టీసీ-1, బీసీ వెల్ఫేర్-1, స్కిల్ డెవలప్మెంట్ -1, సివిల్ సప్లై-8, కాలేజ్ ఎడ్యుకేషన్-1, ఉపాధిక‌ల్ప‌న‌ -2, ఆర్ డబ్ల్యు ఎస్-1, కాలుష్యం -1, ర‌హ‌దారులు-భ‌వ‌నాలు-1, బ్యాంకు రిలేటెడ్ -1 మొత్తం 141 అర్జీలు స్వీకరించగా వాటిలో 75 అర్జీలను స్వయంగాను, 66 ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *